Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
Read Also: Israel: గాజా ఆస్పత్రి కంప్యూటర్లలో ఇజ్రాయిల్ బందీల సమాచారం..
వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను నాగ్‌పూర్ నుంచి పోటీ చేస్తానని, లోక్ సభ ఎన్నికల పోటీపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తాను బీజేపీలో ఉంటానని, పార్టీ తనకు ఇచ్చిన ఏ బాధ్యతనూనా నిర్వహిస్తానని చెప్పారు. మరాఠా కోటా, దాని కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే రాష్ట్రవ్యాప్త పర్యటన గురించి మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రాధాన్యత అని అన్నారు. మరాఠా కోటాకు హమీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఓబీసీ కోటాలో మరాఠా సమాజానికి వాటా ఇవ్వడాన్ని సీనియర్ మంత్రి ఛగన్ భుజ్ బల్ వ్యతిరేకించడం గమనార్హం. వచ్చే శీతాకాల సమావేశాల్లోపు మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నిస్తామని చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని, అయోధ్యలో మహారాష్ట్ర భవన్ నిర్మాణానికి భూమి కేటాయించడానికి యూపీ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్‌లో బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవల మూడు పార్టీలు కలిసి మహారాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ విక్టరీని నమోదు చేశాయి. మెజారిటీ స్థానాలను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఎంపీ స్థానాలు బీజేపీకి కీలకంగా మారాయి.