Deepfakes: “డీప్‌ఫేక్” అతిపెద్ద ముప్పు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepfakes: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదం అయింది. అసభ్యకరంగా ఉన్న ఈ వీడియోలపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ డీప్‌ఫేక్ అనేది ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటిని, ఇది సమాజంలో గందరగోళానికి కారణమవుతోందని శుక్రవారం అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యలయంలో బీజేపీ దీపావళి మిలన్ కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. డీప్‌ఫేక్‌ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా సిబ్బంది ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: Sunny leone: వారణాసిలోపూజలు చేస్తున్న సన్నీ.. చుడిదార్ లో ఎంత అందంగా ఉందో?
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
‘‘తాను పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందని, తెలిసిన వాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారని, ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు, ప్రజలు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించాలి.’’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తాను గర్భా చేస్తున్న డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడారు. ఇది నిజమైందిగా ఉందని, తాను చిన్నప్పటి నుంచి గర్భా ఆడలేదని చెప్పారు. మహిళలతో మోడీని పోలి ఉన్న వ్యక్తి గర్భా చేస్తున్నట్లు సృష్టించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల బాగా వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని దీనిపై స్పందించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయితే వెంటనే ప్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని చాట్‌జీపీటి బృందాన్ని కోరినట్లు ప్రధాని వెల్లడించారు.
ఇటీవల పలువురు సినీ స్టార్ల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై చాలా మంది సెలబ్రెటీలు దీనిపై స్పందించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన తర్వాత కాజోల్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!