వరల్డ్ కప్ 2023లో భాగంగా.. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ ఉత్కంఠ భరిత పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.
AUS vs SA: వరల్డ్ కప్ ఫైనల్కు ఆస్ట్రేలియా.. ఉత్కంఠ పోరులో ఆసీస్ గెలుపు
ఇదిలా ఉంటే.. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ మ్యాచ్ లను తిలకించేందుకు ఎంతో మంది అతిరథ మహారథులు వచ్చారు. ముఖ్యంగా బీసీసీఐ ప్రేక్షకులను అలరించేందుకు గాను కొందరు ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను అందించింది. మరోవైపు సెమీ ఫైనల్ మ్యాచ్లో రజనీకాంత్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కనిపించారు. అలా ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒక స్టార్ కనబడుతూనే ఉన్నారు. అయితే.. ఈ నెల 19న జరగబోయే ప్రతిష్టాత్మక మ్యాచ్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు ఎవరు చీఫ్ గెస్టుగా వస్తారనే దానిపై ఓ వార్త వినిపిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ప్రధాని మోదీ చీఫ్ గెస్టుగా వస్తున్నారట. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
lottery: కంట్రోల్ రూం ఆపరేటర్ని వరించిన అదృష్టం.. లాటరీలో రూ.45 కోట్లు గెలుపు..