PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఈ యుద్ధం వల్ల ఇరువైపు సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేయడంతో 1400 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై జరిపిన వైమానికదాడుల్లో 3000 మంది మరణించారు. మంగళవారం గాజాలోని అల్ అహ్లీ హస్పిటర్ పై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. అయితే ఈ దాడికి ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. గాజా…
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ కీలక దశకు చేరుకోనుంది. గగన్‌యాన్ మిషన్ కింద అక్టోబర్ 21న టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ప్రకటించింది.
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు.
Asaduddin Owaisi: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరోసారి ఓడిపోవడంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినంధించారు. భారత ఘన విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
Shaktikanta Das: మొరాకోలోని మారాకేష్ నగరంలో శనివారం జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ కార్డ్స్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కి 'A+' ర్యాంక్ లభించింది.
2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలనే ఇండియా అభిప్రాయాన్ని ఆయన నొక్కిచెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ బిడ్డింగ్ వెస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 141వ సెషన్‌ని మోడీ ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ జరుగుతోంది. భారతదేశంలో చివరి ఒలింపిక్ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. 2029 యూత్ ఒలింపిక్స్‌కు…
PM Modi: నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ‘గర్భా’ సాంగ్ రిలీజైంది. ముఖ్యంగా గుజరాతీలు శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యువతీయువకులు సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’ చేస్తారు. దీంట్లో భాగంగా గర్బా పాటల ఆల్బమ్ రిలీజైంది. ఈ పాటను ప్రధాని నరేంద్రమోడీ రాయడం విశేషం. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో ఈ విషయాన్న వెల్లడించారు.
Shehla Rashid: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.