Virat Kohli: విరాట్ కోహ్లీకి అభినందనల వెల్లువ.. ప్రధాని మోడీ, సచిన్ ట్వీట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు. 113 బంతుల్లో 117 రన్స్ సాధించాడు. ఈ ఘనత సాధించినందుకు విరాట్ కోహ్లీని ప్రధాని నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షాతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఈ మేరకు వారు ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, 50వ సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విరాట్ కోహ్లీ తన 50 సెంచరీని సాధించమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి నిర్వచించే పట్టుదలకు ఉదాహరణగా నిలిచారు. ఈ అద్బుతమైన మైలురాయి, అతని నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం. నేను అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అతను భవిష్యత్ తరాలకు బెంచ్‌మార్క్ సెట్ చేస్తూనే ఉన్నాడు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
Also Read
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
- Neeraj Chopra: లుసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు రజతం.. 88.05 మీటర్ల సీజన్ బెస్ట్
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
Today, @imVkohli has not just scored his 50th ODI century but has also exemplified the spirit of excellence and perseverance that defines the best of sportsmanship.
This remarkable milestone is a testament to his enduring dedication and exceptional talent.
I extend heartfelt… pic.twitter.com/MZKuQsjgsR
— Narendra Modi (@narendramodi) November 15, 2023
Read Also: Deepika Padukone: దీపికా కూడా నెపోటిజం బాధితురాలేనా!.. హాట్‌టాపిక్‌గా హీరోయిన్ కామెంట్స్
సచిన్ ట్వీట్ చేస్తూ.. ‘‘నేను తొలిసారిగా మిమ్మల్ని ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో కలిసినప్పుడు.. మిగతా ప్లేయర్లు ఆట పట్టిస్తూ, నా పాదాలు తాకాలని ప్రాంక్ చేశారు. ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను.. కానీ వెంటనే మీ పాషన్, నైపుణ్యం నా హృదయాన్ని తాకారు. ఆ యువకుడు ‘విరాట్’గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఒక భారతీయుడి నా రికార్డును బద్దలు కొట్టినందుకు మాత్రమే కాకుండా, ప్రపంచకప్ సెమీస్‌లో నా హోం గ్రౌండ్‌లో ఈ రికార్డు సాధించినందుకు గర్వంగా ఉంది’’ అంటూ పోస్ట్ చేశారు.
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
‘‘వన్డే క్రికెట్లో 50వ సెంచరీ సాధించి, చారిత్రక మైలురాయిని సాధించినందుకు విరాట్ కోహ్లీకి నా అభినందనలు. ఇది మీ అత్యుత్తమ క్రీడా స్పూర్తికి, అంకిత భావానికి, నిలకడకు నిదర్శనం. మీరు మీ ఆటను మరింత స్థాయికి ఎదగనివ్వండి, దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
50th ODI hundred 👏
Kudos to @imVkohli for achieving the historic milestone of scoring his 50th century in ODI cricket. This is a testimony of your outstanding sportsman spirit, dedication and consistency. May you further elevate your game to a new level. The nation is proud of… pic.twitter.com/6v1YtDoKnh
— Amit Shah (@AmitShah) November 15, 2023
తాజావార్తలు
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?