రోజ్గార్ మేళా 2023లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు 51 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి మేళాను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కాకుండా పని చేస్తుందని అన్నారు.
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అససరాల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఆకాంక్షలను, అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించినప్పటికీ.. కేంద్రం రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi: ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ‘పాత ఫోన్’గా అభివర్ణించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతని మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు.
అయోధ్యలో రామ మందిరం త్వరలో సిద్ధమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆలయ నిర్మాణంలో హిందూ ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్యుల సహకారాన్ని కొనియాడారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు.
ప్రస్తుతం ఆలయం దాదాపుగా నిర్మించబడింది, విగ్రహ ఏర్పాటు జనవరి 22న నిర్వహించబడుతుంది, ప్రధాని మంత్రిని ఆహ్వానించాం, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని అన్నారు. ఇది కేవలం త్యాగాల గురించి కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిందని ఆయన అన్నారు.
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
Mahua Moitra: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా కేసులో చిక్కుకుంది.
Mobile Network: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నెట్వర్క్ సమస్య పూర్తిగా తీరనుంది. మార్చి 2024 నాటికి భారతదేశంలోని ప్రతి గ్రామంలో మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడతాయి.