ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్ మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాని మోడీ ఓబీసీ కులంలో పుట్టలేదని.. ఆయన తన కులం గురించి అబద్ధాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన కులం గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
గత పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే 'బ్లాక్ పేపర్' విడుదల చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను 'దిష్టిచుక్క'గా అభివర్ణించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ వీల్ చైర్లో కూడా వచ్చి పని చేశారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారాన్ని ప్రశంసించారు.
Mallikarjun Kharge: రాజ్యసభలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో వైఫల్యాలను పీఎం మోడీ ఎండగట్టారు. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంతే స్థాయిలో బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానత వంటి అంశాలపై మాట్లాడలేదని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు కాంగ్రెస్‌కి దేశభక్తి గురించి బోధిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
PM Modi: పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ బానిస మనస్తత్వం వల్ల దేశం వెనకబడి పోయిందని, గత 10 ఏళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ ని పుట్టించిందే బ్రిటీష్ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆరోపించారు.
PM Modi: రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
షెడ్యూల్డ్ తెగలకు చెందిన నకిలీ పత్రాలతో (Fake Caste Certificates) లబ్ధి పొందే అనర్హులపై చర్యలు తీసుకునేలా పార్లమెంటరీ కమిటీ (Parliamentary Panel) కేంద్రానికి సూచించింది.
PM Modi: రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని అన్నారు. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు.
PM Modi: పార్లమెంట్ ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభలో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 40 సీట్లు దాటదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతబడిందని విమర్శించారు.