బీహార్‌లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
కేరళ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ తెలిపారు.
‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న వేళ.. వారిని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో దఫా చర్చలు జరిపేందుకు పిలిచింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే ఛాన్స్ ఉంది.
Best PM: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి 2024 ఎడిషన్ అన్ని లోక్‌సభ స్థానాల్లోని 35,801 మంది ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఈ సర్వే ఆధారపడింది. డిసెంబర్…
PM MODI: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్‌గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పార్లమెంట్లో ప్రసంగిస్తూ..బీజేపీ ప్రభుత్వ విజయాలను గురించి ప్రస్తావించారు. 17వ లోక్‌సభలో కొన్ని తరాలుగా ఎదురుచూసిన విజయాలను సాధించామని ప్రధాని అన్నారు. 17వ లోక్‌సభ చివరి సెషన్ చివరి రోజు ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లలో దేశంలో గేమ్ ఛేంజింగ్ సంస్కరణల్ని తెచ్చామని అన్నారు. అనేక తరాలుగా ఏదురుచూస్తున్న ఆర్టికల్ 370ని ఈ లోక్‌సభలో రద్దు చేశామని, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేసినట్లు ప్రధాని తెలిపారు. రాబోయే 25…