Prahlad Joshi: మంగళగిరి ఎయిమ్స్‌ను పేదల కోసం ఉపయోగపడేలా ప్రధాని మోడీ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తెలుసుకోవాలని లేనివాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు… మోదీ ప్రభుత్వం చేసిన మార్పులను అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయుల సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని.. కోవిడ్ తరువాత భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ గా మారిందన్నారు. ఇండియా 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారబోతోందని ఆయన చెప్పారు.అభివృద్ధి చెందుతున్న అనే ట్యాగ్ తీసేసి అభివృద్ధి చెందిన అనే ట్యాగ్ భారత్‌కు రావాలన్నదే మోదీ ప్రయత్నమన్నారు. భారతదేశం ప్రపంచంలో థర్డ్ ఫ్రంట్‌గా మారాలన్నారు. ఏపీలో 2.8 కోట్ల మందికి బియ్యం ప్రతినెల ఇవ్వడం జరుగుతోందన్నారు. ఏపీలో 67,177 కోట్లు ముద్ర యోజన ద్వారా తీసుకుని 58లక్షల మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారన్నారు.
ఏపీలో 11వేల కోట్లకు పైగా ఆరోగ్య సేవలను ఇవ్వడం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ చెప్పారు. 5 యూనిట్ల ఫుడ్ సేఫ్టీ వాహనాలు, 9 క్రిటికల్ కేర్ సదుపాయాలు ఏపీలో ప్రారంభిస్తున్నామన్నారు. ఒక్క ఏపీలోనే 1800 కోట్ల విలువైన వైద్య ఆరోగ్య సేవలు మోదీ ప్రారంభిస్తారన్నారు. దేశ ఆరోగ్య వ్యవస్ధ గతంలో ఎన్నో ఇబ్బందులకు గురైందన్నారు. illness నుంచీ wellness కు మార్చిన ఘనత మోదీకి దక్కిందన్నారు. దేశంలో 22 ఎయిమ్స్ హాస్పిటల్స్ సేవలందిస్తున్నాయని.. ఏపీలో 180 కోట్లతో మూడు మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేశారని చెప్పారు. ఎల్లప్పుడు తల్లిపిల్లల సంక్షేమం కోసం మోదీ పని చేస్తారని.. తల్లిపిల్లల ఆరోగ్యం ప్రధానమైనదని మోదీ భావిస్తారన్నారు.
ప్రధానమంత్రి ఎయిమ్స్ ద్వారా చేస్తున్న సేవలు ఎన్నదగినవని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు, ఎయిమ్స్ మంగళగిరి రూ.1,618.23 కోట్లతో కట్టడం జరిగిందన్నారు. విశాఖలో ఫుడ్ టెస్టింగ్ లేబొరెటరీలను మోడీ ప్రారంభిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వైద్య సదుపాయాల అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన లో భాగంగా ఎయిమ్స్ మంగళగిరి ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ కాలంలో డోర్ స్టెప్ శాంపిల్ కలెక్షన్ ద్వారా ఎయిమ్స్ మంగళగిరి అత్యుత్తమ సేవలు అందించిందని గవర్నర్ వివరించారు.