PM Modi: కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని, దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేని పీఎం దుయ్యట్టారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ దేశాన్ని చాలా ఏళ్లు పాలించిందని, అయితే వారి దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని, దేశ భవిష్యత్తుపై లేదన్నారు. శనివారం ‘విక్షిత్ భారత్ విక్షిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Viral Video: కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టిందంటే ఇదే.. ఈ వీడియో చూడండి
ఛత్తీస్‌గఢ్‌లో రూ. 34,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని, ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని అన్నారు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే పట్టించుకునేదని, దేశ నిర్మాణాన్ని మరిచిపోయిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఆలోచన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే తప్పితే.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఎజెండా లేదని ఆయన అన్నారు.
ఈ రోజుకి కూడా కాంగ్రెస్ దశ-దిశ గతంలోలాగే ఉన్నాయని, కాంగ్రెస్ పరివార్వాదం, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించడం లేదని, తన కుమారులు , కుమార్తెల భవిష్యతుతను రూపొందించడంలో బిజీగా ఉంందని, మీ కుమార్తెలు, కుమారుల భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆలోచించడం లేదని ప్రధాని అన్నారు. పేదలు, యువత, మహిళల సాధికారతతోనే అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్ నిర్మించవచ్చని పీఎం మోడీ అన్నారు.