West Bengal: ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన నేపథ్యంలో.. భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
Read Also: SIMI Terrorist: 22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ హనీఫ్ షేక్ అరెస్ట్.. ఒకే క్లూతో చిక్కాడు..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఇదిలా ఉంటే మార్చి 1,2,6 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోదీ మార్చి 1న హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్, మార్చి 2న నదియా జిల్లాలోని కృష్ణానగర్ మరియు మార్చి 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లర్లతో హింసాత్మకంగా ఉన్న సందేశ్‌ఖలీ ప్రాంతం ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉంది.
ఇదిలా ఉంటే, టీఎంసీ నేతలు, కార్యకర్తలపై భూ కుంభకోణాలు, లైంగిక నేరాల వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తృణమూల్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మార్చి 10న సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ‘జన గర్జన’ సభ జరగబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెప్పారు. ‘‘మార్చి 10న జరిగేది టీజర్ మాత్రమే అని, అసలు సినిమా ఎన్నికల్లో ఉంటుంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..