లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. తొలి టర్మ్‌లో అభివృద్ధి పథంలో కాంగ్రెస్ సృష్టించిన గుంతలను పూడ్చడానికే కాలయాపన చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు దేశాభివృద్ధికి పునాది వేశాం, రెండో టర్మ్‌లో దేశం వేగంగా ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. 'ఇండియా ఎనర్జీ వీక్ 2024'ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. రూ. 1,350 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్డ్ ఇండియా, డెవలప్డ్ గోవా 2047 కార్యక్రమంలో మోడీ ప్రసంగించనున్నారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు... ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని…
పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
ఇవాళ రాష్ట్రపతి హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మహ్మద్ ముయిజ్జూ మాట్లాడుతూ..తాన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదని తెలిపారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెట్టనున్నారు.
BAPS Hindu Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్(BAPS) ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన ప్రధాని, అక్కడ ర్యాలీలో మాట్లాడారు. స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని, తమ సంస్కృతిని, గతాన్ని చూసి సిగ్గు పడ్డారని ఆదివారం అన్నారు. రాజకీయ, సొంత ప్రయోజనాల కోసం తమ స్వంత సంస్కృతి మరియు చరిత్ర గురించి సిగ్గుపడే ధోరణిని ప్రారంభించారని,
Jairam Ramesh: బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీ, ఎల్కే అద్వానీకి సంబంధించి రెండు సంఘటనల గురించి ఆయన మాట్లాడారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్వానీ, ఆయనను కాపాడారని, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలనుకున్నారని, వాజ్‌పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారని జైరాం రమేష్ అన్నారు. ఆ సమయంలో ఎల్కే అద్వానీ నరేంద్రమోడీకి…
Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు…
Asaduddin Owaisi: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి ఈ రోజు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించింది. అయితే, నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని ఎగతాళి చేశారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘‘ ఎల్కే అద్వానీకి భారతరత్న దక్కింది. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేదీ కాదు’