Petrol and Diesel Prices: క్రమంగా పైపైకి కదులుతూ కొత్త రికార్డులను సృష్టించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి.. అయితే, త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌పూరి.. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూశాయని.. అయితే, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయని చెప్పుకొచ్చారు.. కానీ, పెట్రోల్‌పై లాభాలు వస్తున్నా.. డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారని…
పెట్రోల్, డీజిల్ ధరలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. భారత్‌లో ఆల్‌టైం హై రికార్డులను సృష్టించాయి పెట్రో ధరలు.. అయితే, కేంద్రం పన్నుల్లో కొంత కోతపెట్టింది.. అదే దారిలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. కానీ, ఇప్పటికీ భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైమాటే. ఈ సమయంలో పాకిస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. పెట్రోల్ డీజిల్ ధరను భారీగా తగ్గించింది.. పెట్రోల్ రేటును లీటరుకు 18.5 పాకిస్థాన్ రూపాయిలు అంటే భారత్ కరెన్సీ…
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ…
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా…
ఉగాది పర్వదినం రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శాంతించలేదు. పండగ వేళ అని కూడా చూడకుండా వాహనదారులకు చమురు కంపెనీలు వాహనదారులకు షాకిచ్చాయి. పెట్రోల్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ 80 పైసల చొప్పున పెరిగాయి. గత 12 రోజుల్లో పెట్రోల్ రేట్లను పెంచడం ఇది పదో సారి. 12 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.20 చొప్పున పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి.. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు.. మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభిం,చాయి.. వరుసగా రెండో రోజు లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.01కు చేరగా..…
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో మనదేశంలోనూ… పెట్రో మంట రేగడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు 10 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చని అంచనాలున్నాయి. ధరల పెరుగుదల ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం…
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్… జఠిలసమస్యగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్ రూ.15లను ఒక్కసారిగా పెంచేశాయి.…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నిరసనలకు పిలుపు ఇవ్వగా.. అధికార పార్టీ వైసీపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. బీజేపీ తీరుపై ఏకంగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’ అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.100 దాటించి రూ.5, రూ.10 తగ్గించామని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని నిలదీసింది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి…