ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి.. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు.. మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభిం,చాయి.. వరుసగా రెండో రోజు లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.01కు చేరగా.. డీజిల్ ధర రూ.88.27కు పెరిగింది.. మూడు ప్రభుత్వరంగ ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్.. భారతదేశంలో ఇంధన రిటైలింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే కాగా.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ధరలను పెంచడానికే మొగ్గు చూపుతున్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజా వడ్డింపులతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.21 నుండి రూ.97.01కి, డీజిల్ ధర రూ.86.67 నుంచి రూ.88.27కి పెరిగాయి.. ఇక, ముంబైలో, పెట్రోల్ ధర లీటరుకు రూ.111.67కి, డీజిల్ లీటర్‌కు రూ.95.85కి పెరిగింది. కోల్‌కతా మరియు చెన్నైలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ.106.34 మరియు రూ.91.42, చెన్నైలో రూ.102.91 మరియు రూ.92.95 చేరింది.. మరోవైపు బెంగళూరులో పెట్రోల్ ధర రూ.102.26గా, డీజిల్ రూ.86.58కి చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరగా.. ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 87పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరగడంతో.. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10కి ఎగబాకింది. దేశవ్యాప్తంగా రిటైల్ ధరలను తగ్గించేందుకు గత ఏడాది నవంబర్ 3న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది.. ఇక, కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా పెరుగుదలకు బ్రేక్ పడింది.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోవడం.. అంతర్జాతీయ చమురు ధరలు ఈ సంవత్సరం మళ్లీ పెరగడంతో మళ్లీ వడ్డింపులు ప్రారంభించాయి.