పెట్రోల్, డీజిల్ ధరలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. భారత్‌లో ఆల్‌టైం హై రికార్డులను సృష్టించాయి పెట్రో ధరలు.. అయితే, కేంద్రం పన్నుల్లో కొంత కోతపెట్టింది.. అదే దారిలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. కానీ, ఇప్పటికీ భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైమాటే. ఈ సమయంలో పాకిస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. పెట్రోల్ డీజిల్ ధరను భారీగా తగ్గించింది.. పెట్రోల్ రేటును లీటరుకు 18.5 పాకిస్థాన్ రూపాయిలు అంటే భారత్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీజిల్ రేటు లీటరుకు 40 పాకిస్థాన్ రూపాయిల అంటే భారత్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 15 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. గత 3 నెలల కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు భారీగా పెంచిన పాక్ సర్కార్.. ఇప్పుడు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించింది..
Read Also: Astrology: జులై 16, శనివారం దినఫలాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయిన తర్వాత పాక్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పెట్రోల్ ధరను లీటరుకు PKR 18.50 మరియు డీజిల్ ధరను లీటరుకు PKR 40.54 చొప్పున తగ్గించారు. దేశాన్ని ఉద్దేశించి షరీఫ్ చేసిన ప్రసంగంలో, ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయిన తర్వాత ధరలు తగ్గిస్తున్నా.. తన ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్య ఇదని పేర్కొర్నారు.. ప్రస్తుతం పెట్రోల్ కొత్త ధర లీటరుకు PKR 230.24 కాగా, డీజిల్ లీటర్ PKR 236 వద్ద అందుబాటుగా ఉంది.. ఈరోజు అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపారు.