Rohit Sharma: వివాదంలో హిట్‌మ్యాన్.. పాక్ మాజీ కెప్టెన్‌ను హత్తుకున్న రోహిత్ శర్మ! వీడియో చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఎన్నో అనుమానులు, మరెన్నో సందేహాలను పటాపంచలు చేస్తూ, 2026 టీ20 ప్రపంచకప్‌లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి15 ఆదివారం రోజున జరిగింది. మొత్తానికి నిన్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఈ ఆసక్తికరమైన పోరులో భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించి తన ఆధిపత్యాన్ని మరోమారు చాటిచెప్పింది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు తుక్కురేగొట్టారు. ఈ మ్యాచ్ అప్డేట్స్ పక్కన పెడితే ఈ ఆసక్తికరమైన పోరులో మరొక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా..
Also Read
- Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- AB de Villiers: "కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు".. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
- Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
ఈ మ్యాచ్‌కు ముందే కొలంబోకు వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్‌ను హత్తుకుంటూ కనిపించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మ ఐసీసీ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రీ-మ్యాచ్ షోలో సంజనా గణేశన్ సమక్షంలో హిట్‌మ్యాన్ పాకిస్థాన్ మాజీ కెప్టె్న్ వసీమ్ అక్రమ్‌తో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. అయితే, భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం నడుస్తున్న టైంలో రోహిత్-వసీమ్ అక్రమ్ ఆలింగనం, హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి సంఘీభావంగా టీమిండియా, పాకిస్థాన్ ప్లేయర్స్‌తో టోర్నీలతో సంబంధం లేకుండా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఆపేసింది. దీనిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి దృష్టికి తీసుకెళ్లిన, ఇరుజట్టుల మధ్య హ్యాండ్‌షేక్ పునరుద్ధరణ ఇప్పటివరకు మళ్లీ అమలులోకి రాలేదు. అయితే రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌కు ఆలింగనం ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇవ్వండం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిజానికి రోహిత్ శర్మ ఐసీసీ బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్నారు. ఆయన తనకు ఉన్న ప్రోటోకాల్స్ కారణంగా పాటిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో, బ్రాడ్‌కాస్టర్లతో అవసరమైతే హ్యాండ్‌షేక్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి.
Legends Hugs, Kids don’t Shake Hands.. #INDvPAK #T20WorldCup pic.twitter.com/FmfZlF12yA
— Nibraz Ramzan (@nibraz88cricket) February 15, 2026
READ ALSO: Aira Rawat: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెన్సేషనల్ బ్యూటీ..
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!