Pakistan Cricketer Haider Ali Arrested Over Rape Allegations: పాకిస్తాన్ క్రికెట్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. వివాదాలు, లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పాక్ క్రికెటర్స్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్.. లాంటి స్టార్స్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారం కేసులో పాక్ యువ ఆటగాడు హైదర్ అలీ అరెస్ట్ అయ్యాడు.…
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ వాయిదా పడింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్ 2025ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (మే 7) నుంచి పీఎస్ఎల్ మ్యాచ్ జరగలేదు. గురువారం రావల్పిండిలో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. రావల్పిండి స్టేడియంకు సమీపంలో భారత్ దాడులు జరపడంతో ఈ మ్యాచ్ రద్దు అయింది. భారత్, పాకిస్థాన్…
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా చేపట్టింది. బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందిని మట్టుబెట్టింది. గురువారం కూడా దాడులు కొనసాగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో గురువారం ఒక డ్రోన్ కూలింది. స్టేడియం సమీపంలోని ఒక రెస్టారెంట్ భవనంపై డ్రోన్ పడగా.. పలువురు గాయపడ్డారు. ఈ డ్రోన్ ఐపీఎల్ 2025 మ్యాచ్‌కు ముందు కుప్పకూలడంతో పీసీబీ బయపడిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్…
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్‌ను నిషేదించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే…
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్‌ను నిషేధించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో టీమిండియా పాకిస్థాన్‌తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఫైర్ అయ్యారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైందని మండిపడ్డారు.…
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యాజమాన్యాన్ని కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ జట్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంపిక చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.