రాష్ట్రానికి మంత్రి అయినా అనంతపురం జిల్లాకు కూలీగా పని చేస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న పయ్యావుల కేశవ్‌కు సోమవారం మండలంలోని బాట సుంకులమ్మ ఆలయ సమీపంలో ఘన స్వాగతం లభించింది.
కోర్టు వ్యాఖ్యానాలు చూస్తే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చేయని తప్పుకు 50 రోజులు చంద్రబాబు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది అని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Payyavula Keshav vs Perni Nani: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది.. అయితే, అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎంత వాడీవేడీగా చర్చ సాగినా.. లాబీల్లో మాత్రం.. కొన్నిసార్లు ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటాయి.. ఇవాళ లాబీల్లో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని-టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది..…
AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు.. టీడీపీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా..? అంటూ ఛాలెంజ్ చేశారు. నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్ చంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా అర్జా శ్రీకాంత్ నివేదిక ఇచ్చారన్న పయ్యావుల. సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం.. సాఫ్ట్వేర్ వాల్యూయేషన్ సర్టిఫికేషన్…
Payyavula Keshav: వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ఆలోచనను తాము సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన…
Payyavula Keshav: ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం…