Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిన హస్తిన
- ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం
- ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిన హస్తిన
- ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లింది. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోయారు. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీలో ఆకాశం మేఘావృతం అయి ఉంది. దీంతో బుధవారం ఉదయం, సాయంత్రం సమయాల్లో ఢిల్లీ ప్రాంతమంతటా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో నగరమంతా గందరగోళంగా మారింది.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ధూళి తుఫాను ముంచెత్తింది. ఓ వైపు మెరుపులు, ఇంకో వైపు భారీ వర్షం. బలమైన గాలులు వీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే విమాన రాకపోకలపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. ఇక మెరుపులు సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాలకు, కిటికీలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో దేశమంతటా విభిన్న వాతావరణం కొనసాగవచ్చని.. దీని కారణంగా పలు ప్రాంతాల్లో అడపాదడపా భారీ వర్షాలు, ఈదురు గాలులు, స్థానిక అంతరాయాలు ఏర్పడవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ధూళి తుఫానులు, ఉరుములతో కూడిన వర్షాలు ప్రభావం చూపునున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపునుందని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi-Sonia Gandhi: ఒకే ఫ్రేమ్‌లో మోడీ-సోనియాగాంధీ.. ఫొటో వైరల్
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!