వైసీపీ ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందనే రీతిలో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని.. సీఐడీని చాలా వరకు తప్పు పట్టింది అని ఆయన పేర్కొన్నారు. మేం ఇన్నాళ్లూ చేసిన వాదనలనే బెయిల్ తీర్పులో కోర్టు ప్రస్తావించింది.. స్కిల్ కేసులో మొదటి నుంచి చివరి వరకు చంద్రబాబు కనుసన్నల్లో ఉన్నట్టుగా సీఐడీ చిత్రీకరించింది.. సీఎంగా ఉన్న చంద్రబాబుకేం సంబంధం లేదనే రీతిలో కోర్టు వ్యాఖ్యానించింది అని పయ్యావుల కేశవ్ అన్నారు.
Read Also: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
సీఐడీ చేసిన ఆరోపణలకు.. అభియోగాలకు ఆధారాలు చూపలేదని కోర్టు స్పష్టంగా చెప్పింది అని టీడీపీ పయ్యావుల కేశవ్ తెలిపారు. అసలు ఆధారాలుంటే కదా చూపడానికి?.. టీడీపీ అకౌంట్లోకి స్కిల్ కేసు డబ్బులు వచ్చాయని కూడా ప్రాథమిక ఆధారాలు కూడా చూపలేదని కోర్టు అభిప్రాయపడింది.. సరైన ఆధారాల్లేకుండా రిమాండుకు ఎలా పంపారనే భావన వచ్చేలా కోర్టు వ్యాఖ్యాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఖాతాలో డబ్బులు చేరాయనే అభియోగానికి ఎలాంటి ఆధారాలు సీఐడీ చూపలేకపోయారనే కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.. 30 రోజులు జైల్లో ఉంచిన తర్వాత కూడా చంద్రబాబుకు లబ్ది చేకూరిందనే ఆధారాలు చూపలేకపోయారని కోర్టు స్పష్టంగా చెప్పింది అని పయ్యావుల తెలిపారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: స్కిల్ స్కామ్‌తో సంబంధంలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి..!
స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషనుకు నష్టం ఎలా జరిగిందనే ఆధారమూ లేదని కోర్టు వ్యాఖ్యానించింది అని టీడీపీ సీనియర్ నేత కేశవ్ అన్నారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలను కూడా సమర్పించలోకపోయారని కోర్టు అభిప్రాయపడింది.. సునీత ఫైల్ చదవకుండానే కామెంట్లు రాశారని మేం గతంలోనే చెప్పాం.. టీడీపీ తప్పుడు సమాచారంతో తప్పు దోవ పట్టిస్తోందని సజ్జల వంటి వారు మాట్లాడారు.. మేం చెప్పిన దాంతోనే కోర్టు ఏకీభవించింది.. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది?.. బెయిల్ ఆర్డరులోనే ఫైనల్ జడ్జిమెంట్లో రాసినట్టు కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.. పన్ను ఎగవేత విషయంలో అప్పటి సీఎం చంద్రబాబుకేం సంబంధం లేదని కోర్ట్ అభిప్రాయపడింది అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Read Also: Harish Rao: బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో వేటు వేసిన ఒకటే
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేూసులో సీఐడీకి ఏం తోచిందో అదే పెట్టేశారు అని టీడీపీ సీనియర్ నేత పయ్యావు కేశవ్ ఆరోపించారు. కోర్టు తీర్పు.. కామెంట్లు వైసీపీకి చెంపపెట్టులా ఉంది.. కోర్టు వ్యాఖ్యానాలు చూస్తే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చేయని తప్పుకు 50 రోజులు చంద్రబాబు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది అని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.