Payyavula Keshav: విశాఖపట్నంలోని రుషికొండ భవన నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. రుషికొండ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండి పడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్న బకాయిలు బిల్లులు రూ.6,700 కోట్లకు పైగా ఉన్న వాటిని చెల్లించడానికి ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖపై ప్రత్యేక సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో 14 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నాం అని మంత్రి పయ్యావుల చెప్పారు. నేడు జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. 10 గంటల 7 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. అంతకుముందు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం…
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు.
ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. తమ విభాగంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న బిల్లులపై ఆర్థిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పెండింగ్ బిల్లులపై వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది.
బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు.