Cabinet Sub-Committee: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు..
- రైతులందరికీ బీమా అమలు చేయాలి..
- విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలి..
- అధికారులకు మంత్రులు అచ్చెన్నాయుడు.. పయ్యావుల కేశవ్.. నాదెండ్ల మనోహర్ ఆదేశాలు..
- పంట బీమాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub-Committee: రైతులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు చేయాలని.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. స్పష్టం చేశారు.. పంట బీమాపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు.. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు..
Read Also: Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రీమియం చెల్లింపులు జరగలేదని విమర్శించారు మంత్రులు.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగేలా బీమా అమలు కావాలని సూచించారు.. దిగుబడి బట్టి, వాతావరణ పరిస్థితుల బట్టి బీమా అమలులో ఉన్న అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.. బీమా అమలు, క్లైమ్ లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు. వైసీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని, తిరిగి ఈ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్ బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, ఉద్యాన శాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు.. ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!