ఏపీకి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడైంది. 2021-22 ఆర్థిక స్థితి గతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. ఎఫ్ఆర్ బీఎం చట్టం నిర్దేశించిన పరిమితి కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు 9.85 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చులు 4.25 శాతం మేర పెరిగాయి. మొత్తంగా రూ. 26,380 కోట్ల ఖర్చు చేయని నిధులు మురిగిపోయాయి. నిధులు ఖర్చు పెట్టకుండా రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించి చూపేలా ప్రయత్నం జరిగింది.
సామాజిక-ఆర్ధికాభివృద్ధి పథకాల కోసం రుణాలపై ఆధారపడకుండా అదనపు రెవెన్యూ వనరుల కోసం ప్రయత్నించాలి.ఆస్తుల కల్పన-ఆర్ధికాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాలి.ఆశించిన ప్రయోజనాలు పొందేందుకు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి.హామీలు ఇచ్చేముందు సంస్థల రుణాలు తీర్చే సామర్ధ్యాన్ని లెక్కించాల్సి ఉంది.ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండానే రూ. 2812 కోట్ల ఖర్చు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్ధిక కోడ్ కు విరుద్దమైన ఈ లావాదేవీలను అనుమతించింది.
Read Also:Australia : నెంబర్ వన్ ప్లేస్ కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన భారత్..
ఆర్ధిక సంఘం గ్రాంట్లను పంచాయితీల విద్యుత్ బకాయిల పేరుతో రూ. 1351 కోట్లు మినహాయించారు.స్థానిక సంస్థలకు చెందిన నిధుల్లో ఆర్ధిక శాఖ కోత విధించటం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉంది. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 413 కోట్ల డీఏ బకాయిలను అనుచితంగా డెబిట్ చేశారు. ఖజానా నియంత్రణను ఉల్లంఘించి సీఎఫ్ఎంఎస్ బ్యాక్ ఎండ్ ద్వారా ప్రత్యేక బిల్లులు, సర్దుబాట్లను నిలిపివేయాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ రంగ సంస్థలు 3,387 కోట్ల నష్టాల్ని చవిచూశాయి. ఏపీ డిస్కంలు గణనీయమైన నష్టాలను నమోదు చేసాయి.
Read Also:Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ చివరి రోజున.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత కాగ్ నివేదిక సభలో పెట్టారు. రూ. 1,18, 393 నిధులను అసెంబ్లీ అకౌంట్లల్లో కూడా పెట్టలేదని కాగ్ చెప్పింది.తప్పకుండా చెల్లించాల్సిన బకాయిలను పద్దుల్లో చూపలేదు.పైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ. 480 కోట్లను దారి మళ్లించింది.పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను అకౌంట్లల్లో చూపలేదు.ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను ఖాతాల్లో చూపించకపోవడం నేరం.అవి ఏ ఖాతాల్లోకి పోతున్నాయో క్లారిటీ లేదు.నిధులని దారి మళ్లిస్తున్నారని మేం గతంలో చెబితే విమర్శించారు.. ఇప్పుడు కాగ్ అదే విషయం చెప్పింది.ఏపీలో ఆర్థిక విస్పోటం.. ఇదే విషయం కాగ్ చెప్పింది.ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించింది.ప్రభుత్వ సంస్థల రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వ ఖాతాల్లో చూపాల్సిందే.ప్రభుత్వ గ్యారెంటీలను.. అప్పులను దాచారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.