ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు.…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్ధతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి స్టీల్ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని పదేపదే చెబుతూ వస్తోంది. కేంద్రం తీరు మార్చుకోకపోవడంతో ఇవాళ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు పవన్ . ఉదయం 10 నుంచి సాయంత్రం…
దళితులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని అమలాపురం మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. జగన్ చెల్లెలు కులాంతర వివాహాం చేసుకున్న ఫర్వాలేదు. కానీ ఇతరులు చేసుకుంటే కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం నిలిపివేసిందని హర్షకుమార్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వం నాన్చుడి…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే నేడు మీడియాతో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆ గట్టా…ఈ గట్టా…? అంటూ ప్రశ్నించారు. మేమైతే పవన్ బీజేపీతోనే ఉన్నారని అనుకుంటున్నామని, ఆయన చేయగలిగింది కూడా ఉందని, జగన్ ఇచ్చిన సలహాలు పరిగణలోకి తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపండి అని కొరొచ్చునని సూచించారు. మోడీకి ఒక వినతి ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అంటూ ఆయన…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ఇప్పటికే సిద్దమైంది. దీనిపై అటు కేంద్రకేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేయబోతున్నారనే వార్తలు వచ్చాయో అప్పటి నుంచే ఉక్కుకార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, దీక్షలు, పోరాటాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు కార్మికులకు మద్దతు తెలిపారు. Read: వావ్: రెండే…
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం కన్నులపండుగగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు…
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల…
టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నమూడు సినిమాలు సంక్రాంతి పోరులో ఢీ అంటే ఢీ అంటున్నాయి. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’ తో సంక్రాంతి మొదలు కాగా 13 న ‘భీమ్లా నాయక్’, 14 న ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానున్నాయి. ఇక జక్కన్న ఎన్ని ప్రయోగాలు చేసినా ‘భీమ్లా నాయక్’ మాత్రం తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. పాన్ ఇండియా సినిమాల మధ్య రీమేక్ గా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ అందించిన గీతాలు చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్…