ఏపీలో వినోదం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం టికెట్ల రేట్లపై హేతుబద్ధత తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా కమిటీ ఏర్పాటుచేసింది. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ సీఎం జగన్ తో చర్చించిన సంగతి తెలిసిందే.
టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విధానాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు మంత్రి పేర్ని నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో కానీ, ఇటు రాజకీయాల్లో కానీ మాకు టార్గెట్ కాదన్నారు మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ కంటే మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలకే కలెక్షన్లు ఎక్కువగా వస్తాయన్నారు. అప్పుడెప్పుడో అత్తారింటికి దారేది సినిమా హిట్ అయిందని, ఆ పేరు చెప్పుకుంటున్నారని నాని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని టికెట్ల వివాదం తెచ్చారని వస్తున్న ఆరోపణలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అంత బద్దలుకొట్టేది ఏంటి? ఆయన జీవితానికి ఎన్ని సినిమాలు వచ్చాయి. ఏడాదికి ఒక సినిమా తీస్తారు. ఆ ఒక్క సినిమాకు మేం ఏం చేస్తాం. అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్లు పవన్ కి వస్తాయా? పవన్ కంటే చిన్న హీరోలు సినిమాల్లో రాణిస్తున్నారన్నారు పేర్ని నాని. పవన్ కి ఇండస్ట్రీకి సంబంధం ఏంటన్నారు.