టాలీవుడ్ లో అందం, అభినయం కలబోసిన హీరోయిన్లో నిత్యామీనన్ ఒకరు.. పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రల్లో తప్ప గ్లామర్ రోల్స్ కి నిత్యా ఎప్పుడు ఓకే చెప్పదు .ఇక ఇటీవల అమ్మడు ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక…
పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక రీమేక్ చిత్రానికి ఇంతగా హైప్ రావడం భీమ్లా నాయక్ వలనే అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మేకర్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను…
అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన పార్టీ ప్రస్థానం కొనసాగుతోందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ్యాంగ నిర్మాత, భారతరత్నం బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. ఓ ప్రకటన విడుదల చేసిన జనసేనాని.. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం అన్నారు.. రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయని పేర్కొన్న ఆయన.. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను అంబేద్కర్ ముందే పసిగట్టి…
హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి హిరోయిన్ నిధి అగర్వాల్‌ను తప్పించారనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. పవస్టార్ పవన్ కళ్యాణ్ హిరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరిహర వీర మల్లు ఇప్పటికే ఈ సినిమాను క్రిష్‌తోపాటు మరో డైరెక్టర్ ఆనంద్ సాయి భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించేందుకు రాజస్థాన్‌లో ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు కొణిజేటి రోశయ్య అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. రోశయ్య మృతికి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అజాత శత్రువు కన్నుమూతతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన” భీమ్లా నాయక్” టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం నుండి 4 వ సింగిల్ ‘అడవి తల్లి మాట’ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు దుమ్మురేపడంతో ఈ సాంగ్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ సాంగ్ రిలీజ్ డేట్ ను…
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ‘భీమ్లా నాయక్’ తహతహలాడుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్, స్టార్ హీరో మూవీ ‘అఖండ’ ఘన విజయం సాధించడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో సరికొత్త జోష్ ను నింపినట్టయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రచార హోరును, జోరును మరింతగా విస్తృతంగా, విస్తారంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ లోని నాలుగవ…
‘వకీల్ సాబ్’ చిత్రంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కొనసాగుతాను అని పవన్ చెప్పడంతో ఈ చిత్రం తర్వాత మూడు సినిమాలు లైన్లోకి వచ్చేసాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ విడుదలకు సిద్దమవుతుండగా.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుపుకొంటుంది. ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న, భారీ అంచనాలున్న మల్టీ స్టారర్ ‘భీమ్లా నాయక్’. మేకర్స్ ఈ చిత్రం నుండి మరో ఆసక్తికరమైన సింగిల్‌ను విడుదల చేస్తామంటూ రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా ఆ సాంగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ‘అడవి తల్లి మాట’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్ట్రీ…
ఎన్నో తెలుగు చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించిన గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పందిస్తూ.. అక్షర తపస్వీ సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు పాటను కొత్త పుంతలు…