2014, మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో ఈ వేడుకలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళగిరి మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు పరిశీలించారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు రెడీ
మంగళగిరి మండలంలోని కాజ టోల్‌గేట్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన స్థలాన్ని, డీజీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న మరో స్థలాన్ని జనసేన చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే)తో కలిసి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అయితే కాజ దగ్గర ఉన్న స్థలమే సభ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ సభకు సుమారు లక్షమందికి పైగా జనసేన కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.