ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ జగన్ మత్స్యకారుల కష్టాలు గాలికొదిలేశారన్నారు. మత్స్యకార్ల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం చేపలు అమ్ముకోవడం ఏమిటి? జీవో 217తో నాలుగున్నర లక్షల మంది మత్స్యకారుల ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందన్నారు.
మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి జనసేన లక్ష్యం. ఎన్నికల ముందు మత్స్యకార్లకు ఇచ్చిన హామీలు సీ.ఎం జగన్ ఎందుకు నెరవేర్చడం లేదని మనోహర్ ప్రశ్నించారు. కాకినాడ సూర్యారావుపేటలో జనసేన మత్స్యకార అభ్యున్నతి యాత్ర ప్రారంభించారు నాదెండ్ల మనోహర్. ఈనెల 20న నర్సాపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ సందర్బంగా మత్స్యకార గ్రామాల్లో పార్టీ పాదయాత్రలు చేస్తుందన్నారు. మత్స్యకార కుటుంబాలకు పార్టీ వెన్నుదన్నుగా వుంటుందన్నారు.