మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు.…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి కీలక అప్డేట్ను చిత్ర బృందం మంగళవారం వెల్లడించింది. ఈ మూవీలోని ‘అడవి తల్లి మాట’ అంటూ సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే భీమ్లానాయక్ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే అడవి తల్లి పాటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Read…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతి పట్ల జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. శివశంకర్ మాస్టర్ మరణం బాధాకరమని, కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారని కొనియాడారు. రామ్‌చరణ్ మగధీరలో శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ట్రీట్‌పై ఊహాగానాలు పెరుగుతున్నాయి. Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ తాజా సమాచారం ప్రకారం రానా…
‘వాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎస్.జె సూర్య.. ‘ఖుషీ’ చిత్రంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని హిట్ ని ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి దేవుడిగా మారాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ…
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్లు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి.. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయని పేర్కొన్న ఆయన.. జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వరద గ్రామాల్లో పర్యటించి బాధితులను…
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఈ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా, మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇది నిన్నటి వార్తే కానీ తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నారట. “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఫ్రెండ్ లైఫ్…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా కలిసి సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ ని కలవడానికి గల అసలు కారణం ‘భీమ్లా నాయక్’. “భీమ్లా నాయక్” రూపంలో కొత్త తలనొప్పిరాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే…
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. అయితే ఇందులో ఏదో ఒక సినిమాను వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతల సమావేశం కూడా జరిగింది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఈ సినిమాల నిర్మాతలూ భేటీ అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఆ సమావేశం సాధారణంగానే ముగిసింది. అయితే ఇందులో ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేయాలంటూ నిర్మాతపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘భీమ్లా నాయక్’…
వైసీపీ ప్రభుత్వం పై పవన్ ఫైర్ అయ్యారు. ఓ వైపు రాష్ర్టంలో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. రాష్ర్టం లో అరాచక పాలన నడుస్తుందని అన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ర్టాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారన్నారు. పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన…