పెద్ద సినిమాలకు లీక్ కష్టాలు తప్పట్లేదు. నిన్న మహేష్ బాబు “సర్కారు వారి పాట” సాంగ్ ఫుల్ గా లీక్ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కారణంగా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలనీ మేకర్స్ నిర్ణయించిన సాంగ్ ను అంతకంటే ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనను మరవక ముందే ‘భీమ్లా నాయక్’కు లీక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.
Read Also : Ram : భారీ రెమ్యూనరేషన్ కు డిమాండ్… రిస్క్ తప్పదా?
టైటిల్ సాంగ్ లోడింగ్ అంటూ ఊరించిన “భీమ్లా నాయక్” నిర్మాతలకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. ‘భీమ్లా నాయక్’ పాటలోని ఒక డ్యాన్స్ బిట్ ఇంటర్నెట్‌లో లీక్ అయింది. వెంటనే ఆ బిట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అనూహ్యమైన లీక్‌లను నిరోధించడానికి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు భద్రతను పెంచాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సాంగ్ విడుదల కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.