Bheemla Nayak : క్రేజీ అప్డేట్… సెట్లో మరో డైరెక్టర్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ప్లాన్ కు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
Read Also : Mohan Babu : ఇంట్లో భార్యలకు భయపడతారు… మర్యాద లేదు…!!
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
‘భీమ్లా నాయక్’ బృందం ఈ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ కొత్త స్టిల్‌ను విడుదల చేసింది. టైటిల్ సాంగ్ అప్‌డేట్ కూడా రాబోతోందని వెల్లడించింది. విడుదల తేదీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సెన్సార్‌కి మేకర్స్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక విడుదల తేదీని ప్రకటించనున్నారు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ సెట్స్ లో దర్శకుడు హరీష్ శంకర్ సందడి చేయడం విశేషం. వీరిద్దరి కాంబోలో “భవదీయుడు భగత్ సింగ్” రూపొందనున్న విషయం తెలిసిందే. ‘భీమ్లా నాయక్ ‘ సెట్స్ లో ఈ సినిమా కథ గురించి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!