OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ప్రీమియర్స్ రోజు టికెట్ ధర రూ.800గా నిర్ణయంచారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ మీద రూ.100, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఏపీలోనూ ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Also : Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్
ఓజీపై భారీ అంచనాలున్నాయి. పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇంకా అంచనాలు పెంచడం ఇష్టం లేక పవన్ కల్యాణ్ సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరుస్తున్నారు. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది.
Read Also : OG : పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్..