AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండాతో సమావేశం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ భేటీ..
- అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
- 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది.. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్ గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనకు నేడు ఆమోదం తెలపనుంది కేబినెట్.. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇక, వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ నేడు కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ను అనుసరించి.. ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది..
Read Also: Chemical Factory Blast: కెమికల్ కంపెనీలో భారీ బ్లాస్ట్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!
మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలు ఏర్పాటుకు భూములు కేటాయింపుకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కు కన్వర్షన్ కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. ఇక, వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15 వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనున్నారు..
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?