OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ వస్తున్నాడు. టీమ్ మొత్తం రేపు ఫుల్ సందడి చేయబోతోంది. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లకు పవన్ చాలా దూరంగా ఉన్నారు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్
ఎందుకంటే ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలను పెంచొద్దని ఆయన ఉద్దేశం. సినిమా స్థాయికి మించి అంచనాలు పెంచితే మంచిది కాదని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే రేపు నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ దెబ్బతో అంచనాలు అమాంతం పెరిగిపోతాయని అంటున్నారు. మరి రేపు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఓజీ సినిమా గురించి మాట్లాడుతుండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.
Read Also : Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..