పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పవర్ ఫుల్ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మరొకటి యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ.. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.. పవన్ ఖాతాలో వీటితో పాటు ఎప్పుడో మొదలైన హరి హర వీరమల్లు సినిమా కూడా…
ఇవాళ్టి సమావేశం హిస్టారికల్ మీటింగ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు.
నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన ఈ తొలి జేఏసీ సమావేశం జరుగనుంది.
Pawan Kalyan:వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె పుష్పవల్లితో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ అంగరంగ వైభవంగా జరిగింది.
రేపు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలోనే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.
ఇప్పుడు లోకేశ్ కూడా ఏడుస్తున్నాడు.. చంద్రబాబు ఏడుపు నాటకం, లోకేశ్ ఏడుపు ఆవేదన అనిపిస్తుంది.. తన లాంటి చేత గాని పప్పుకు కూడా మూడు శాఖలు ఇచ్చిన తన తండ్రి చంద్రబాబును జైల్లో వేశారని లోకేశ్ ఆవేదన చెందుతున్న పరిస్థితి అని ఆయన అన్నారు.
నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ…