Pawan Kalyan: ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఇప్పటికే దృష్టి సారించిన బీజేపీ.. ఈ నెల 22న వరంగల్ లో ప్రచారానికి పవన్ కల్యాణ్ ను పంపుతోంది. దీంతో పాటు వీలైతే వరంగల్ పశ్చిమతోపాటు తూర్పు నియోజకవర్గంలో కూడా రోడ్ షోలు నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. గెలిచే అవకాశాలున్న స్థానాలపై బీజేపీ గట్టి ఫోకస్ పెట్టింది. అధికార యంత్రాంగం కూడా ఇక్కడి అభ్యర్థులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ… జనాల్లో పార్టీ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా పార్టీ అగ్రనేతలను అవసరమైన నియోజకవర్గాలకు పంపుతోంది. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం కూడా ముమ్మరం చేయగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లాలో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 18న ఖిలా వరంగల్‌లో ‘సకల జనుల విజయ సంకల్ప సభ’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ అమిత్ షా మరోసారి ఉమ్మడి జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరవుతారు.
Read also: Renuka Chowdhury: కేటీఆర్ ఐటీలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు
తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఈ అంశం రాష్ట్రంలోనూ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న (బుధవారం) వరంగల్ నగరంలో ప్రచారంలో పాల్గొనేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి వరంగల్ బీజేపీ కార్యకర్తలకు సమాచారం అందింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా రావు పద్మ నిలవగా, ఆయనకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. నగరంలో రోడ్ షోలు నిర్వహించి ప్రసంగాలు చేయనున్నారు. ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తేలుస్తుంది. పార్టీ అగ్రనేత పవన్‌కల్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని చూసి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.
Kishan Reddy: బీజేపీ అధికారంలోకి రాక పోతే.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..