Nandamuri Balakrishna: బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ రోజు జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందన్నారు.. నేను , పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.. టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికుతుందన్న ఆయన.. రాష్ట్ర మొత్తం ఇన్ని సీట్లు అన్ని సీట్లు కాదు.. మొత్తంగా టీడీపీ , జనసేన గెలవాలని పిలుపునిచ్చారు..
Read Also: Taj Mahal: తాజ్ మహల్ వద్ద సీపీఆర్ చేసి తండ్రి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు
Also Read
ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు.. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలి.. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతుంది.. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదు.. ఒక హిందూపురంలో తప్ప అని.. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం అని వెల్లడించారు. ఒక సిమెంట్ రోడ్డు గానీ, ఒక గొయ్యికి తట్టెడు మట్టడు కానీ పోయలేదు, తట్టేడు మట్టికాని తీయలేదని విమర్శించారు. పరిపాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు.. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. కానీ, రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు. ఆరోగ్య ఆస్పుత్రులకు బకాయి పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. డబ్బులు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నాడు అని విమర్శించారు.. గడపగడపలో పార్టీలకు అతీతకంగా ప్రజలు నిలదీస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
Read Also: Gaza: టన్నెళ్లలో ఇజ్రాయెల్ సైనికుల తనిఖీలు.. గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో భారీగా ఆయుధాలు..!
వైఎస్ జగన్ పాలనలో పది సంవత్సరాలు పాటు రాష్ట్రంలో పాలన వెనక్కి వెళ్లిపోయిందన్నారు బాలయ్య. రాష్ట్రానికి అప్పులు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు.. 1000 కోట్ల అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ – జనసేన కార్యకర్తలు కలవడం.. ఇలా సమావేశం నిర్వహించడం.. కలిసి ముందుకు నడవడం.. ఒక మంచి శుభ పరిణామం అన్నారు. జనం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అని తెలిపారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో స్వతంత్ర సమరయోధులను అవమానిస్తున్నారు.. మన ఉనికికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.. అరాచక ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలంటే ఓటు ఒక్కటే.. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు బాలయ్య.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!