సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా పై అటు అభిమానుల్లో, ఇటు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆ మూడో ఇది.. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఇప్పటికే ఇది పాన్ ఇండియన్ కాకపోయినా భారీ బిజినెస్ చేసుకుని రీజనల్ సినిమాల్లోనే రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతుంది.. దీంతో ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవ్వకుండా చూసుకోవాలని టీమ్ అంత చాలా కష్ట పడుతున్నారు. మరి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా వీటిని డబల్ చేసేందుకు మరింతగా ప్లాన్ చేస్తున్నాడు.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపానున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..
ఇదిలా ఉండగా తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ తెలుస్తుంది.. పవర్ స్టార్ అయితే ఈ సినిమాలో ఎలాంటి గెస్ట్ రోల్ చేయడం లేదట…త్రివిక్రమ్, మహేష్ కోసం తన వాయిస్ ను వినిపించనున్నారట.. ఈ సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్ లోనే కాకుండా పలు కీలక సన్నివేశాల్లో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చారని, ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది.. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు.. ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది..