Minister Jogi Ramesh: మూడు ప్రాంతాలనుండి మూడు సామాజిక రథాలు ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న కటౌట్ పెట్టి బస్ యాత్ర చేస్తేనే గ్రామాలు, పట్టణాలు, జన సంద్రంగా మారుతున్నాయన్నారు. సైకిల్‌కి తుప్పు పట్టిందని, గ్లాసు పగిలిపోయిందని మంత్రి పేర్కొ్న్నారు. పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. చంద్రబాబు జైలు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడన్నారు. సామాజిక న్యాయం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదన్నారు.
Also Read: Andhrapradesh: రబీకి అవసరమైన సాగునీటి విడుదలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
ఈ రాష్ట్రం నుంచి నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభ సభ్యులను చేసింది సీఎం జగన్ అంటూ మంత్రి జోగి రమేష్ తెలిపారు. స్పీకర్, ఛైర్మన్ స్థానాలలో వెనుకబడిన వారిని కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే,.. పవన్ కళ్యాణ్ చెంచా నాదెండ్ల మనోహర్ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పు అంటున్నాడని మండిపడ్డారు. పేదవారిపై వీరంతా కక్ష కట్టారన్నారు. ప్రభుత్వం చేస్తుంది తప్పో కాదో ప్రజలే చెప్పాలన్నారు.