Jammu Kashmir: బోల్తా పడిన యాపిల్ లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా వస్తువులతో వెళ్తున్న లారీ.. రోడ్డుపై బోల్తా పడిందంటే ఏం చేస్తారు. దగ్గరలోని స్థానికులు వచ్చి అందులోని వస్తువులను లూఠీ చేస్తారు. మనం ఇంతకుముందు చాలా ఘటనలు చూసి ఉంటాం. టమాటా, బీర్లు, బిస్కెట్స్, ఎగ్స్, కూరగాయాలు ఇలా ఏ వస్తువులైనా.. వాటిని తీసుకెళ్తున్న ట్రక్కులు, లారీలు బోల్తా పడ్డాయంటే స్థానికులు క్షణాల్లో లూఠీ చేసేస్తారు. కానీ తాజాగా జమ్మూ కశ్మీర్ లో ఏం జరిగిందంటే.. శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.
Read Also: Terrorist Arrest: ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్.. ఐసిస్ మాడ్యూల్తో సంబంధాలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఆ తర్వాత.. ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిని మొత్తం క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన ట్రక్కులో రూ. 25 నుంచి 30 లక్షల యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ లూఠీ కాకుండా సురక్షితంగా ఓ పక్కన పెట్టేశారు. దీంతో ఆపిల్ వ్యాపారికి లక్షల ఆస్తి నష్టం తప్పింది. ఈ సహాయంపై వ్యాపారి వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇదిలా ఉంటే.. రాంబన్ జిల్లా కమీషనర్ మస్రత్ జియా స్వయంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారందరిని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు కూడా తన హ్యాండిల్‌లో ఈ సంఘటన యొక్క వీడియోను విడుదల చేసారు. దేశంలో జరిగే ఇలాంటి సంఘటనల్లో సహాయ పడాలని.. వస్తువులను లూఠీ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.
Event of the Day: Passengers, drivers join Traffic & Ex Police, Army & Paramilitary forces in securing fruit boxes from turtled truck at Nachlana on NH-44. Thank you. @diprjk @OfficeOfLGJandK @DrJitendraSingh @Rameshkumarias @mussarat_zia pic.twitter.com/91yudD9GUq
— Mussarat Zia (@mussarat_zia) October 2, 2023
Read Also: World Costly Nail Polish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే..ప్రత్యేకత ఏంటంటే?
- Tags
- Apple
- help
- jammu kashmir
- load
- lorry
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!