Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది.. పార్వతీపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఒడిశాకు చెందిన ట్రావెల్ బస్సు ఒకటి.. బ్రిడ్జిపై అదుపు తప్పింది. కింద ఉధృతంగా నది ప్రవహిస్తోంది. బస్సు సగం భాగంగా బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా నదిలోకి పడేదే. అలాంటి సమయంలో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఇంతలో స్థానికులు గుమిగూడారు. ఎమర్జన్సీ డోర్ నుంచి ఒక్కొక్కరుగా కిందకు దిగారు. మొత్తం 50 మంది ప్రయాణికులు బ్రిడ్జిపైకి దిగి బతుకుజీవుడా అనుకుంటూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, చాలా సినిమాల్లో బ్రిడ్జిలపై, కొండలపై చివర బస్సులు ఇరుక్కుపోవడం.. హీరోలు చాకచక్యంగా.. సాహసంతో అందరినీ కాపాడడం లాంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూశాం.. అదంతా షూటింగ్ కోసం చేసేదే.. కానీ, బస్సు బ్రిడ్జిపై ఆగిన దృశ్యాలు చూస్తే మాత్రం.. సినిమాను మించిన విజువల్‌గా ఉంది.
Read Also: Health Benefits : జామ ఆకులు నిజంగా ఆ సమస్యను తగ్గిస్తుందా?