గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, పట్టణాలు, నగరాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి.
Read Also: Varun Tej: పలాస డైరెక్టర్ తో మెగా ప్రిన్స్ ‘మట్కా’…
మరోవైపు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురవడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రైల్వే పట్టాల పైకి నీరు రావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-కాజీపేట రూట్‌లో రెండు రైళ్లు రద్దు చేశారు.. కాగా, పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. అలాగే.. పెద్దపల్లి జిల్లాలో సైతం వరద ప్రవాహంతో 2 గంటల పాటు పట్టాలపై పలు రైల్లు నిలిచిపోయాయి.
Read Also: Kishan Reddy: దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే..!
అయితే, రైళ్లు నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక రైల్వే ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హసన్ పర్తి-కాజీపేట బ్రిడ్జి నెంబర్ 3 దగ్గర పట్డాలపై ప్రమాదకరమైన స్థితిలో వరద నీరు ప్రవహించడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళను రైల్వే అధికారులు నిలిపివేశారు. మరో రెండు గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దని ఇప్పటికే అధికారులు వారికి తెలియజేశారు.. భారీగా వరద ప్రవాహం రావడంతో ట్రైన్స్ ను నిలిపివేసినట్లు వారు పేర్కొన్నారు.