Toll Plaza: వాహనదారులపై టోల్ భారం.. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ..!
- వాహనదారులపై టోల్ భారం
- ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఫీజు
- అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లూ టోల్ మోత మోగుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్‌ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో.. గత అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది.
గత సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే రూ.160, తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా.. టోల్ వసూళ్లు ఉండేవి కావు. అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం.. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం చొప్పున వసూలు చేస్తున్నారు. దాంతో పని నిమ్మిత్తం ప్రయాణించే వారిపై పెను భారం పడుతోంది. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలాది మంది వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అందరిపై టోల్ ఫీజు రూపంలో తీవ్ర భారం పడుతోంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రాష్ట్రంలో మొత్తంగా 69 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వాటిలో 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు అవుతుండగా.. 4 టోల్ ప్లాజాల్లో మాత్రం పాత విధానం అమల్లో ఉంది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్ ప్లాజా.. నెల్లూరు-చెన్నై హైవేలోని వెంకటాచలం, బూదరం, సూళ్లూరుపేట టోల్ ప్లాజాల్లో పాత నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటి గుత్తేదారుల బీవోటీ 2031లో ముగుస్తుంది. అప్పటివరకు ఈ నాలుగు ప్లాజాల్లో 24 గంటల్లోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా.. ఒకసారి పూర్తిఫీజు, రెండోసారి సగం ఫీజు ఛార్జ్ చేస్తారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!