IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
- ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్
- బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది
- జీరో పేమెంట్‌తో టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
అయితే ప్రయాణికులు బుకింగ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత అంటే 14 రోజులలోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బుక్ నౌ, పే లేటర్ సదుపాయంతో ఇకపై మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నప్పుడు, టికెట్ బుక్ చేసుకునేందుకు తగినంత డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు..
టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC యాప్ లేదా సైట్‌కి వెళ్లి లాగిన్ కావాలి. బుక్ నౌ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన వివరాలను, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో క్రెడిట్, డెబిట్, BHIM యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేసి టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
పే లేటర్ ఫీచర్ ను యూజ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందు ఈ పేలేటర్ ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్ పేజీలో పే లేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా జీరో పేమెంట్ తో టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. లేకపోతే 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!