IndiGo Flights: ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం.. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
- ఇంకా పునరుద్ధరించబడని ఇండిగో విమాన సర్వీసులు
- మూడు రోజులుగా నిలిచిన ఇండిగో విమాన సర్వీసులు
- ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం
- తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబోయ్.. ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు రోజులుగా విమాన సర్వీసులు లేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇటు ఇంటికి వెళ్లలేక.. అటు ప్రయాణం లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఏ క్షణంలోనైనా సర్వీసులు పునరుద్ధరణ కాకుండా పోతాయా? అంటూ ఎదురుచూస్తున్నారు. ఇక పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. తిండి తిప్పలు లేక అక్కడ్నే సేదతీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మూడు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొదట కొన్ని సర్వీసులు రద్దు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 500కు చేరింది. మొత్తం 500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఎమర్జెనీ ప్రయాణం ఉన్నవారికి పీడకలగా మారింది. ఎయిర్‌పోర్టులకు వచ్చాక.. సర్వీసులు లేవని చెప్పడంతో ప్యాసింజర్స్ షాక్‌కు గురవుతున్నారు. పెద్ద ఎత్తున క్యూలు ఉన్నాయి. ఎక్కడ చూసినా సూట్‌కేసులు, వాటర్ బాటిళ్లు పడి ఉన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. చాలా మంది నేలపైనే పడుకున్నారు. మరికొందరు కోపంగా ఆందోళనకు దిగారు. ఇంకొందరు విమాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లినందుకు ఆ నలుగురు ఫీల్ అవుతున్నారా..?
12 గంటలు అవుతున్నా ఎయిర్‌లైన్స్ ఎటువంటి సమాచారం రాలేదని ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో వాపోయాడు. ప్రతిసారీ ఒక గంట ఆలస్యం.. రెండు గంటలు ఆలస్యం అని చెబుతున్నారని.. పెళ్లికి వెళ్లడానికి వచ్చి ఇరుక్కుపోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ దుమ్మెత్తిపోస్తు్న్నారు. ఇలా ప్రతి ప్రయాణికుడు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!