Indigo Flights-DGCA: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు.. ఇండిగో అధికారులను పిలిచిన డీజీసీఏ
- దేశ వ్యాప్తంగా 200 ఇండిగో విమానాలు రద్దు
- ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు నరకయాతన
- సమాధానం చెప్పేవాళ్లు లేక ఆందోళనలు
- ఇండిగో అధికారులను పిలిచిన డీజీసీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్‌తో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు రోజుల నుంచి 200 విమానాలు ఆగిపోయాయి. కొన్ని నడుస్తున్నా.. అవి కూడా సమయ పాలన లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్‌పోర్టుల్లో చూసినా వేలాది మంది ప్రయాణికులతో గజిబిజి గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఎయిర్‌పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు. సమాధానాలు చెప్పేవాళ్లు లేక ఆందోనలు, నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు వేడుకోలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ఎన్నికల సమయంలో మమత యాక్షన్.. ముస్లిం ఎమ్మెల్యే సస్పెండ్
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
పైకి సిబ్బంది కొరత, సాంకేతిక సమస్య అని చెబుతున్నప్పటికీ ఇంకేదో సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇండిగో విమాన సంస్థ నుంచి సరైన వివరణ బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొనడంతో ఇండిగో అధికారులను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సమావేశానికి పిలిచింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో విమానాల రాకపోకలకు గల కారణాలను అడిగి తెలుసుకోనుంది.
ఇది కూడా చదవండి: Air India-Anoushka Shankar: నా సితార్‌ను నాశనం చేశారు.. ఎయిరిండియాపై కళాకారిణి ఆగ్రహం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దయ్యాయి. ఇక గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో 33 విమానాలు రద్దు కాగా.. బెంగళూరులో 73, హైదరాబాద్‌లో 68, అహ్మదాబాద్‌లో ఐదు, కోల్‌కతాలో నాలుగు విమానాలు రద్దు అయ్యాయి. బుధవారం నుంచి సిబ్బంది కొరత కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా విమాన సంస్థ చెబుతోంది.
సహజంగా శీతాకాలంలో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. విదేశాల్లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి. దీంతో ఎక్కువ ప్రయాణాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్‌లో ఇండిగో విమానాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ జర్నీ చేసేవాళ్లంతా ఆగమాగం అయిపోతున్నారు. సమస్య పరిష్కరించాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!