హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సంస్థ మెట్రో సేవలను పొడిగించింది. ఆగస్ట్ 30న ప్రత్యేకంగా పొడిగించిన సేవలు అందిస్తోంది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా..ఎక్కువ సమయం.. ఎక్కువ భక్తి.. ఎక్కువ సౌకర్యం.. అంటూ హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. నగరంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేషుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో సేవలను పొడిగించినట్లు తెలిపింది. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.