IRCTC: పనిచేయని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. దీపావళి ప్రయాణికుల ఆందోళన
- పనిచేయని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్
- దీపావళి ప్రయాణికుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ కోసం ఎక్కడున్నా సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా వేడుకలు జరుపుకుంటారు. ఇక బీహార్‌లో అయితే ఎన్నికల పండుగ కూడా జరుగుతోంది. అంతేకాదు ఈనెల 25 నుంచి 28 వరకు ఛత్ పండుగ కూడా జరగబోతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపుల ఎక్కడున్నా సరే సొంతూళ్లకు వచ్చేస్తారు. ఇలాంటి పండుగ సమయంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. శుక్రవారం ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పని చేయడం మానేసింది. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో దీపావళి పండుగపై నీళ్లు చల్లినట్లైంది. టికెట్లు బుక్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
శుక్రవారం ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్, యాప్‌కు కూడా పని చేయడం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ కావడం లేదు. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎర్రర్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mary Millben: రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు.. మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని
దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు స్పందించారు. వైబ్‌సైట్, యాప్ క్రాష్ అయిందని.. తత్కాల్ రద్దీ సమయంలో ఈ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తిస్తున్నారని.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
పండుగ సమయాల్లో వెబ్‌సైట్ ఎర్రర్ రావడం ఇదే తొలిసారి కాదు. ప్రతి పండుగ సమయాల్లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంటుంది. విపరీతమైన రద్దీ కారణంగా అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్రస్తుతం ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.. విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!