వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ, పారిస్ స్పోర్స్ కోర్ట్ తీర్పు వాయిదా వేసింది. 24 గంటలపాటు నిర్ణయాన్ని పొడిగించింది. రేపు (ఆదివారం) తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా.. ఈరోజు(శుక్రవారం నాడు) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో వినేష్ ఫోగట్ పిటిషన్ పై విచారణ జరిగింది.
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. 'నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది' అని అమన్తో ప్రధాని అన్నారు.
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్‌కు చేరితే.. రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య…
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు డప్పు వాయిద్యాలతో, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వేసి ఉదయం నుంచి భారత ఆటగాళ్ల కోసం విమానాశ్రయం లోపల అభిమానులు భారీ సంఖ్యలు వేచి ఉన్నారు. ఆటగాళ్లు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఆరు పతకాలు సాధించింది. నేడు జరిగే క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సవాల్‌ను ప్రదర్శించనున్నారు. నేడు జరిగే క్రీడల్లో భారత్ 7వ పతకాన్ని కూడా గెలుచుకోవచ్చు.