Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌లో రితికా ఓటమి.. కాంస్యం మీదే ఆశలు
- క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి
- కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో పరాజయం
- రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్‌కు చేరితే.. రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకం పైనే ఆశలు ఉన్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
క్వార్టర్ ఫైనల్‌లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐపెరి మెటెట్‌తో మొదట డ్రా అయింది. ఆ తర్వాత రితికా చివరి పాయింట్‌ను కోల్పోయింది. ప్రారంభంలో ఒక పాయింట్ ఆధిక్యాన్ని పొందగలిగిన రితికా.. రెండో భాగంలో గట్టిపోటీ ఇచ్చింది. మ్యాచ్‌కి చివరి పాయింట్‌గా రుజువైన ‘పాసివిటీ (ఓవర్ డిఫెన్సివ్ యాటిట్యూడ్)’ కారణంగా రితికా పాయింట్ కోల్పోయింది. 21 ఏళ్ల రితికా మొదటిసారి ఒలింపిక్స్లో ఆడుతుంది. ఈ వెయిట్ కేటగిరీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత దేశానికి చెందిన తొలి రెజ్లర్‌గా రితిక రికార్డులకెక్కింది. కాగా.. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ నిబంధనలు భారత్ స్వర్ణ పతక ఆశలకు పెద్ద దెబ్బ తీశాయి. రితికా కంటే ముందు వినేష్ ఫోగట్ కూడా పతకం సాధించలేకపోయింది. ఆమె బరువు కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణం వల్ల ఫైనల్ ఆడలేకపోయింది. నిబంధనల ఆధారంగా ఆమెను అనర్హులుగా ప్రకటించారు.
AP CM Chandrababu: ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ నేతల భేటీ..
రితికా రోహ్‌తక్‌లోని ఖడ్కడ గ్రామంలో భారతీయ నావికాదళానికి చెందిన అధికారి. ఆమె ఇండియన్ నేవీలో అధికారి, చీఫ్ పీటీ ఆఫీసర్‌గా పనిచేసింది. 2022లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 72 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తరువాత.. టిరానాలో 2023లో జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2024లోనే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 72 కేజీల విభాగంలో రితికా కాంస్య పతకం సాధించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..